News April 8, 2025
కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Similar News
News October 17, 2025
రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల బృందం రేపు 12 PMకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉద్యోగులకు డీఏ సహా వివిధ ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం మంత్రులను ఆదేశించారు.
News October 17, 2025
భారత్ మౌనంగా ఉండదు: మోదీ

కొవిడ్ తర్వాత ప్రపంచంలో వరుస యుద్ధాలు, ఉద్రిక్తతలు కొనసాగినా భారత్ అభివృద్ధిలో ముందుకెళ్లిందని ప్రధాని మోదీ NDTV సమ్మిట్లో అన్నారు. సగటున 7.8% వృద్ధిరేటు సాధిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై దేశం మౌనంగా ఉండదని.. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ రూపంలో వారికి గట్టిగా బదులిచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం బ్యాంకింగ్ సెక్టార్లో సంస్కరణలు తెచ్చిందని వివరించారు.
News October 17, 2025
సీఎం అభినందనలు అందుకున్న నక్కపల్లి విద్యార్థిని

నక్కపల్లి గర్ల్స్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలిక కె.చైత్రినిని అమరావతిలో సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం అభినందించారు. సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ అనే అంశానికి సంబంధించి నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో చైత్రని అద్భుతమైన పెయింటింగ్ వేసింది. ఈ పెయింటింగ్ రాష్ట్ర స్థాయిలో మన్ననలు పొందటంతో విద్యార్థిని ప్రతిభను సీఎం ప్రశంసించారని ఆర్జేడి విజయభాస్కర్, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి తెలిపారు.