News February 20, 2025
కేయూ: పీజీ మొదటి సెమిస్టర్ పరీక్ష వాయిదా

కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రానికి సంబంధించిన <<15507872>>పీజీ మొదటి సెమిస్టర్ పరీక్ష<<>> వాయిదా పడింది. ఈ నెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఉండటంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షను మార్చి 5వ తేదీన నిర్వహిస్తామని, మిగతా పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి, ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
Similar News
News December 4, 2025
రాష్ట్రంలో 134 బోధనా ప్రయోగశాలలు: MP

రాష్ట్రంలో 134 బోధనా ప్రయోగశాలల ఏర్పాటు కేంద్ర పరిశీలనలో ఉందని కాకినాడ MP తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం పార్లమెంటులో తానడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సమాధానం ఇచ్చారని వెల్లడించారు. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా వీటి ఏర్పాటు పరిశీలిస్తున్నారన్నారు. తిరుపతి ఐఐటీకి రూ.25.28 కోట్లు ఇప్పటికే మంజూరైనట్లు మంత్రి తెలిపారని ఎంపీ వెల్లడించారు.
News December 4, 2025
డాలర్.. 12 లక్షల రియాల్స్!

ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఓ డాలర్ 12 లక్షల రియాల్స్‌కు సమానమైంది. ఫలితంగా నిత్యవసరాల ధరలు పెరిగాయి. అణ్వస్త్ర కార్యక్రమాల వల్ల ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. అటు ఆ దేశంలో పవర్ గ్రిడ్ల వైఫల్యం వల్ల గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు అల్లాడుతున్నారు. 2015లో ఓ డాలర్ 32 వేల రియాల్స్‌కు సమానంగా ఉండేది.
News December 4, 2025
MHBD: ‘గుర్తులు’ వచ్చే వరకు మమ్మల్ని కాస్త ‘గుర్తు’ పెట్టుకోండి..!

MHBD జిల్లాలో మొదటి, 2వ విడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. గ్రామాల్లో ఎన్నికల వేడి పెరిగి ప్రచార జోరు సాగుతోంది. ఆయా గ్రామాల్లో ఉదయం నుంచే అభ్యర్థులు ఓటర్ల ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు వెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. గుర్తులు ఇంకా కేటాయించకున్నా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘గుర్తులు వచ్చే దాక తమని గుర్తుంచుకోవాలని ఓటర్లను వేడుకుంటున్నారు. గ్రామాలల్లో పోటాపోటీ రాజకీయం మొదలైంది.


