News February 18, 2025
కేయూ: 105 మంది విద్యార్థినులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు

కేయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ విద్యార్థినులు 105 మంది వివిధ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.భిక్షాలు తెలిపారు. ఇన్ఫోసిస్లో ఇద్దరు, డిజిగీక్స్ ముగ్గురు, జెన్పాక్ట్ 35 మంది, డెల్ఫిటీవీఎస్ 18 మంది, క్యూస్ప్రైడర్ 33 మంది, పెంటగాన్ స్పేస్ 10 మంది, ఎకోట్రైన్స్లో నలుగురు ఎంపికయ్యారని చెప్పారు. వీరిని అధ్యాపకులు అభినందించారు.
Similar News
News March 14, 2025
HYD: 5K రన్కు హాజరు కావాలని వినతి

ఆదివారం ఉదయం 6 గంటలకు ఆల్విన్కాలనీ 124 డివిజన్ పరిధిలోని తులసి వనంలో అవని ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5K రన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రులు జూపల్లి కృష్ణరావు, పొన్నం ప్రభాకర్ను కలసి అవని ట్రస్ట్ ఛైర్మన్ శిరీష సత్తూర్ ఆహ్వానించారు. ఆదివారం ఉ.6 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు.
News March 14, 2025
జనసేన ఆవిర్భావ సభ: దారులన్నీ చిత్రాడ వైపే..

AP: కాసేపట్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు చిత్రాడకు బయల్దేరారు. సభ కోసం 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. పవన్ సహా 250 మంది వేదికపై కూర్చుంటారు. డొక్కా సీతమ్మ, రాజా సూర్యారావు బహుద్దూర్, మల్లాడి నాయకర్ పేర్లతో ద్వారాలు సిద్ధం చేశారు. పవన్ మ.3.30 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు.
News March 14, 2025
ఢిల్లీ నుంచి ఒక్క రూపాయీ తేలేదు: KTR

TG: సీఎం రేవంత్ 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని, కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేదని KTR విమర్శించారు. ‘ ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నావ్. నీళ్లు లేక పంటలు ఎండిపోతే కనీసం సాగునీళ్లపై సమీక్ష కూడా లేదు. హామీల అమలు చేతగాక గాలి మాటలు, గబ్బు కూతలు. జాగో తెలంగాణ జాగో’ అని ట్వీట్ చేశారు.