News February 18, 2025

కేయూ: 105 మంది విద్యార్థినులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు

image

కేయూ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థినులు 105 మంది వివిధ సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.భిక్షాలు తెలిపారు. ఇన్ఫోసిస్‌లో ఇద్దరు, డిజిగీక్స్‌ ముగ్గురు, జెన్‌పాక్ట్‌ 35 మంది, డెల్ఫిటీవీఎస్‌ 18 మంది, క్యూస్ప్రైడర్‌ 33 మంది, పెంటగాన్‌ స్పేస్‌ 10 మంది, ఎకోట్రైన్స్‌లో నలుగురు ఎంపికయ్యారని చెప్పారు. వీరిని అధ్యాపకులు అభినందించారు.

Similar News

News March 28, 2025

కన్నడ భక్తులు రైలు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోండి: ఎంపీ

image

శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది ఉత్సవాల నేపథ్యంలో కర్ణాటక మహారాష్ట్ర నుంచి క్షేత్రానికి పెద్ద సంఖ్యలో పాదయాత్రగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో కన్నడ భక్తుల తిరుగు ప్రయాణం కోసం మార్కాపురం, నంద్యాల మీదుగా ఏర్పాటు చేసిన గుంటూరు-హుబ్లీ ప్రత్యేక రైలు సర్వీసులు భక్తులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం పేర్కొన్నారు. అలాగే రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

News March 28, 2025

HYDలో 50 మంది GOVT అధికారుల తొలగింపు..!

image

పదవీ విరమణ పొందినా చాలా మంది ఇంకా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్, రీ అపాయింట్‌మెంట్ పేరిట ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇలాంటివారు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 50 మంది ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. దీంతో 50 మంది వరకు మార్చి 31న ఇంటిముఖం పట్టనున్నారు. అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఇంకా కిందిస్థాయి సిబ్బంది వీరిలో ఉన్నారు.

News March 28, 2025

కృష్ణాజిల్లాలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ల నియామకం

image

కృష్ణాజిల్లాలో 4 మార్కెట్ యార్డుల ఛైర్మన్లను ప్రభుత్వం శుక్రవారం నియమించింది. గుడ్లవల్లేరు మార్కెట్ యార్డు ఛైర్మన్ పొట్లూరి రవి కుమార్ (టీడీపీ), కంకిపాడు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ అన్నే ధనరామ కోటేశ్వరరావు(టీడీపీ), ఘంటసాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ తోట కనకదుర్గ (జనసేన), మొవ్వ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దోనేపూడి శివరామయ్య (బీజేపీ) నియమితులయ్యారు.

error: Content is protected !!