News February 5, 2025
కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News February 26, 2026
విజయ్-రష్మిక పెళ్లి విందులో పోర్క్ కర్రీ!

విజయ్-రష్మిక పెళ్లి విందులో అతిథులకు పసందైన వంటకాలు రెడీ చేశారు. మెనూలో తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు, గారెలు, పప్పు, పచ్చిపులుసు, ఓల్డ్ సిటీ కీమా సమోసాలు ఉన్నాయి. ఇక కర్ణాటక స్పెషల్ బిసిబెలే బాత్, పంది (పోర్క్) కర్రీ, మైసూర్ పాక్ వడ్డించనున్నట్లు సమాచారం. కాగా తాను ‘కొడగు’ సంప్రదాయమైన పంది కూర తింటానని గతంలో రష్మిక చెప్పడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
News February 26, 2026
ఏప్రిల్ 25న పాలిసెట్.. గుంటూరులో పలు కేంద్రాలు

పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో పలు ప్రధాన కోఆర్డినేటింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గుంటూరులోని MBTS, మహిళా, మైనారిటీ పాలిటెక్నిక్, టెక్స్టైల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, పొన్నూరు పాలిటెక్నిక్ కళాశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి పరిధిలో మంగళగిరి, తెనాలి తదితర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి.
News February 26, 2026
వరంగల్: 14వాహనాలు.. 35 టన్నుల ఇసుక సీజ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాదారులపై పోలీసులు నిఘా ఉంచారు. 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న 14 వాహనాలు అధికారులు పట్టుకున్నారు. సుమారు 35 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకొని, 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.


