News February 5, 2025

కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News December 10, 2025

బుధవారం: గణపయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే?

image

వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బుధవారం రోజున ఆయనకెంతో ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే మన కోర్కెలు తీరుస్తానని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పార్వతీ దేవి తనకెంతో ఇష్టంగా పెట్టే పాయసాన్ని పెడితే కుటుంబ జీవితం సంతోషంతో సాగుతుందట. ఉండ్రాళ్లు సమర్పిస్తే సంకటాలు పోతాయని, లడ్డూ నైవేద్యంతో కోరికలు తీరుతాయని పండితులు అంటున్నారు. బెల్లం-నెయ్యి, అరటి-కొబ్బరిని ప్రసాదాలలో చేర్చితే అధిక ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

News December 10, 2025

ఆదోని జిల్లా సాధనకు నేడు బంద్.. వైసీపీ మద్దతు

image

ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. నేడు జరగబోయే బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో ఐదు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఆలూరు, ఆదోని, మంత్రాలయం పూర్తిగా వెనుకబడ్డాయని పేర్కొన్నారు. ఆదోని జిల్లా సాధనకు వైసీపీ తరఫున మద్దతు తెలుపుతూ జిల్లా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News December 10, 2025

సౌదీలో నాన్ ముస్లింలకు లిక్కర్ విక్రయాలు!

image

సౌదీలో నాన్ ముస్లింలు లిక్కర్ కొనుగోలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెలకు 50వేల రియాల్స్(13,300డాలర్లు), అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికే ఈ వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. మద్యం కొనే టైంలో శాలరీ స్లిప్ చూపించాలనే నిబంధన పెట్టనుందట. ప్రస్తుతం రాజధాని రియాద్‌లో దేశం మొత్తానికి ఒకే ఒక లిక్కర్ షాపు ఉంది. భవిష్యత్తులో మద్యం షాపుల సంఖ్య పెరిగే ఛాన్సుంది.