News February 5, 2025

కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News February 7, 2025

ఎన్నికలకు సిద్ధం.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు

image

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకీ సిద్ధం అని బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. గురువారం వనపర్తిలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని అన్నారు.

News February 7, 2025

బాలానగర్‌: విద్యార్థి మృతి.. కేసు నమోదు

image

బాలానగర్ మండల కేంద్రంలో పదో తరగతి విద్యార్థి ఆరాధ్య ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయేందిర బోయి గురువారం మధ్యాహ్నం విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. విద్యార్థి తండ్రి కొమ్ము రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లెనిన్ గౌడ్ తెలిపారు.

News February 7, 2025

పాచిపెంటలో యువకుడి మృతి

image

పాచిపెంట మండలం పీ.కొనవలస ఘాట్ రోడ్డులో గురువారం స్కూటీని లారీ ఢీ కొట్టడంతో ఒడిశా రాష్ట్రం పొట్టంగికి చెందిన డి.కృష్ణ సుందరి మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. ఒడిశా నుంచి సిమెంట్ లోడుతో సాలూరు వైపు వస్తున్న లారీ స్కూటీని ఢీ కొట్టి లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో స్కూటీపై వెళుతున్న ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. లారీ క్లీనర్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!