News February 5, 2025
కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News February 10, 2025
శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచితంగా లడ్డూ: ఆనం

AP: ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందిలేకుండా తాగునీరు, ఆహారం అందిస్తామని చెప్పారు. శ్రీశైలం పార్కింగ్ నుంచి సత్రాల వరకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ప్రతి భక్తుడికీ ఫ్రీగా లడ్డూ ప్రసాదం ఇస్తామని పేర్కొన్నారు. ఘాట్ రోడ్లపై ట్రాఫిక్‌ను డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు.
News February 10, 2025
చైనా సంక్షోభం: పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరుగుతున్నాయ్

చైనాలో పెళ్లిళ్లు తగ్గి విడాకులు పెరగడం ఆందోళనకరంగా మారింది. 2024లో 61L వివాహాలు నమోదయ్యాయి. 1986 తర్వాత ఇదే అత్యల్పం. 2023తో పోలిస్తే 20.5% తగ్గడం గమనార్హం. ఇక గత ఏడాది 26L జంటలు డివోర్స్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 28K అధికం. అలాగే ఆ దేశంలో శ్రామిక జనాభా(16-59yrs) 68L తగ్గిందని ఓ నివేదికలో వెల్లడైంది. మొత్తం జనాభాలో 60ఏళ్లకు పైగా వయసున్న వారు 22 శాతానికి పెరిగారని తేలింది.
News February 10, 2025
కందుకూరు: ఉచితంగా రూ.45 వేల ఇంజెక్షన్

గుండెపోటు వచ్చినప్పుడు వేసే అత్యంత విలువైన టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ కందుకూరు ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో ఉందని డా. తులసిరామ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన ఒక గంట లోపు టెనెక్టెప్లస్ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే రోగి ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. దీని ఖరీదు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఉంటుందని, కానీ ప్రభుత్వం దీన్ని ఉచితంగా అందిస్తుందని తెలిపారు.