News February 5, 2025
కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News October 20, 2025
దీపావళి రోజున దివ్వెలు ఎందుకు వెలిగించాలి?

దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. సకల దేవతల నివాసం. దీపం వెలిగించిన చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అందుకే దీపం లేని ఇల్లు కళావిహీనమవుతుంది. దీపారాధన లేకుండా దీపావళి చేయరు. దీపపు కుందిలో బ్రహ్మ, విష్ణుమూర్తి ఉంటారు. ఈ వెలుగుల పండుగ రోజున వారే స్వయంగా ఇంట్లో వెలుగు నింపుతారు. దీపం సమస్త దేవతా స్వరూపం కాబట్టే వారిని ఆహ్వానించి, అనుగ్రహం పొందడానికి దీపావళి నాడు దీపాలు వెలిగించాలి.
News October 20, 2025
ప్రమాదాలు జరిగితే ఈ నంబర్లకు కాల్ చేయండి: SP

మతాబులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ దామోదర్ ఆదివారం సూచించారు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే మతాబులు కాల్చాలని, పాత లేదా తడిసిన మతాబులు వినియోగించరాదని చెప్పారు. కాటన్ దుస్తులు ధరించాలనీ, నైలాన్ లేదా సింథటిక్ దుస్తులు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 101, 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News October 20, 2025
ADB: ‘బాణసంచా కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి’

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. టపాసులు కాల్చే సమయంలో కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. ముఖం దగ్గరగా పెట్టి బాణసంచా కాల్చకండి. మీ పిల్లల పక్కనే మీరు ఉండి టపాసులు కాల్చండి. పేలని టపాసుల వద్దకు వెళ్ళకూడదు. అవి ఎప్పుడు పేలేది తెలియాదు. బాగా పొగ ఎక్కువ వచ్చే టపాసులను కాల్చకూడదు. దీనివల్ల ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది.