News February 5, 2025
కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News February 12, 2026
శాతవాహన విశ్వవిద్యాలయం డైరీ ఆవిష్కరణ

శాతవాహన విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలో VC యు.ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ పి.సతీష్ కుమార్, ఓఎస్డీ టు వీసీ డా.హరికాంత్, కళాశాలల ప్రిన్సిపల్స్, ఇతర పరిపాలన అధికారులతో కలిసి డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా VC మాట్లాడుతూ.. విశ్వ విద్యాలయాన్ని విస్తరించేందుకు, ఉత్తర తెలంగాణలో మేలైన విద్యను అందించడంలో శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ముందు వరుసలో నిలపడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
News February 12, 2026
కృష్ణా-వికారాబాద్ రైలు మార్గం.. కేంద్రానికి CM విజ్ఞప్తి

కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. గురువారం ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్‌తో పార్లమెంట్‌లోని ఛాంబర్‌లో భేటీ అయి దీనిపై చర్చించారు.
News February 12, 2026
‘వందేమాతరం’ ఆలాపన ఉత్తర్వులపై ముస్లిం బోర్డు అభ్యంతరం

అన్ని స్కూళ్లు, అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ గేయంలోని 6 చరణాలను ఆలపించాలని కేంద్రం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది. లేదంటే కోర్టులో సవాల్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ పాటలో దుర్గా, ఇతర దేవతల ఆరాధనకు సంబంధించిన పదాలున్నాయి. అల్లాను మాత్రమే ఆరాధించే ముస్లింల నమ్మకాలకు ఇది విరుద్ధం’ అని పేర్కొంది.


