News February 5, 2025

కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News February 26, 2026

గాలివీడులో హత్య కేసు.. ఐదుగురు అరెస్ట్

image

గాలివీడు మండలంలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదాలు, అన్నదమ్ముల మధ్య వర్గపోరు కారణంగానే ఈ హత్య జరిగినట్లు నిందితులు అంగీకరించారు. రూ.4 లక్షల నగదు (మొదటి ముద్దాయి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన సుపారీ), 7 సెల్ ఫోన్లు, 2 కత్తులు, ఒక కారు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన డీఎస్పీ కృష్ణమోహన్, CI, SIని ఎస్పీ ధీరజ్ అభినందించారు.

News February 26, 2026

సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం: కలెక్టర్

image

కాకతీయ కెనాల్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. గురువారం జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పురోగతిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కెనాల్ పనులకు ఆటంకం కలగకుండా భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సాగునీటి సౌకర్యం మెరుగుపడితేనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.

News February 26, 2026

భద్రాద్రి నూతన కలెక్టర్‌గా అంకిత్ బాధ్యతలు

image

భద్రాద్రి జిల్లా నూతన జిల్లా కలెక్టర్‌గా అంకిత్ గురువారం సాయంత్రం 6:19 గంటలకు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో తొలి సంతకం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా బదిలీ అయిన కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ నూతన కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది హాజరై నూతన కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు.