News February 5, 2025
కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News February 11, 2026
నిజామాబాద్: మధ్యాహ్నం నుంచి పెరిగిన జోరు

ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొలుత మందకొడిగా సాగినా, మధ్యాహ్నం 1 గంట తర్వాత ఓటర్లు క్యూ కట్టారు. ఓటింగ్ శాతం పెంచేందుకు పలు చోట్ల అభ్యర్థులు ఓటర్ల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ సీపీ సాయిచైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News February 11, 2026
మెదక్: రేపు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ: కలెక్టర్

మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈనెల 12న నియమితులైన కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ విధులకు నియమించబడిన సిబ్బందిని వారి సంబంధిత అధికారులు రెండు రోజులపాటు విధుల నుంచి విడుదల చేయాలని ఆదేశించారు.
News February 11, 2026
అసెంబ్లీలో ఆవు కథలు చెప్పొద్దు.. మంత్రులకు CBN హెచ్చరిక

AP: క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. ఆవు కథలు చెప్పొద్దని, సమాధానాలు క్లుప్తంగా, అర్థమయ్యేలా ఉండాలని హితబోధ చేశారు. ఉ.9 గంటల నుంచి మ.2 గంటల వరకు అసెంబ్లీలోనే ఉండాలని, ఎమ్మెల్యేలు ప్రస్తావించే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అటు శ్రీశైలంలో శివస్వాములపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని CM ఆగ్రహం వ్యక్తం చేశారు.


