News June 7, 2024
కేయూ: 8 నుంచి దూరవిద్య ప్రాక్టికల్ పరీక్షలు
కేయూ దూరవిద్య పీజీ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 8 నుంచి ప్రారంభిస్తున్నట్లు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ రామచంద్రన్ ప్రకటనలో తెలిపారు. 8న బోటనీ, 9న ఫిజిక్స్, 12న జువాలజీ, కెమిస్ట్రీ, 13న కెమిస్ట్రీ మరో పేపర్ ఉంటాయని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.
Similar News
News December 1, 2024
ద్వైపాక్షిక సంబంధాల పట్ల టర్కీ ఆసక్తి:మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఆసక్తితో ఉన్నట్లు టర్కీ రాయబారి ఫిరట్ సునెల్ వెల్లడించారు. సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఆయన భేటీ అయ్యారు. పరస్పర సహకారంపై అరగంట సేపు వారు చర్చించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైందని టర్కీ పారిశ్రామిక బృందాన్ని పంపించి ఇక్కడి ఎకోసిస్టంను వారు పరిశీలించేలా చొరవ తీసుకోవాలన్నారు.
News December 1, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> BHPL: అనుమానస్పదంగా మృతి చెందిన ఏఎన్ఎం
> WGL: రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
> BHPL: తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి గాయాలు
> WGL: అన్నారం షరీఫ్ లో వ్యక్తి మృతి
> BHPL: బావ అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా బామ్మర్ది మృతి
> HNK: తిరుమలలో గుండెపోటుతో జిల్లా వాసి మృతి
> MHBD: జవాన్ సతీష్ అంతిమయాత్ర
> JN: జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్
News November 30, 2024
WGL: పదేళ్లలో BRS అప్పులు చేసి భారం మోపింది: సీతక్క
గత BRSప్రభుత్వం అప్పులు చేసి భారం మోపిందని, అయినా సరే రైతుల సంక్షేమం కోసం రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు మహబూబ్నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డ అయిన CMరేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నారని, రైతుల సంక్షేమానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. BRSనేతలు రైతులను రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.