News March 6, 2025
కేరళలో ముస్తాబాద్ యువకుడి మృతి

ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ముత్యాల సాయిచరణ్(21) తన స్నేహితులతో కలిసి ఈ నెల 3న కేరళలోని అలప్పుజకు వెళ్లారు. అక్కడ సముద్రంలో హౌస్బోట్లో వెళ్తుండగా సాయిచరణ్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. ఈ నెల 5న సాయిచరణ్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. సమీప బంధువైనటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంత్యక్రియలకు హాజరయ్యారు.
Similar News
News October 19, 2025
ప్రేమికుల వివాదంలో కూన పేరు.. ఖండించిన MLA

ఆముదాలవలస MLA కూన రవికుమార్పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘మా అమ్మాయిని ఓ యువకుడు ఐదేళ్లు ప్రేమించాడు. పెళ్లికి ఒప్పుకొని ఇప్పుడు చేసుకోనంటున్నాడు. వాళ్ల వెనుక ఎమ్మెల్యే కూన ఉన్నారంటూ యువకుడు బెదిరిస్తున్నాడు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు’ అని ఆమె వాపోయింది. కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ ఆరోపణలను MLA ఖండించారు.
News October 19, 2025
బల్మూరు: వినాయకుడి విగ్రహం ధ్వంసం

మండలంలోని బాణాల గ్రామంలో వినాయకుడి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు రాత్రి ధ్వంసం చేశారు. మూడు రోజుల క్రితం హనుమాన్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారని బీజేపీ నాయకులు తెలిపారు.
News October 19, 2025
నెల్లూరు: చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు ఎప్పుడు..?

చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తామంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 100 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. దీంతో చేనేతలు కరెంట్ బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 7 వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. చేనేత కార్మికులకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ జీవో విడుదలైంది కానీ అది ఇంతవరకు ఆచరణలోకి రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.