News March 6, 2025
కేరళలో ముస్తాబాద్ యువకుడి మృతి

ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ముత్యాల సాయిచరణ్(21) తన స్నేహితులతో కలిసి ఈ నెల 3న కేరళలోని అలప్పుజకు వెళ్లారు. అక్కడ సముద్రంలో హౌస్‌బోట్‌లో వెళ్తుండగా సాయిచరణ్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. ఈ నెల 5న సాయిచరణ్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. సమీప బంధువైనటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంత్యక్రియలకు హాజరయ్యారు.
Similar News
News March 24, 2025
రాత్రి భోజనం తర్వాత ఇలా చేయండి!

కొన్ని అలవాట్లు రాత్రి తిన్న తర్వాత జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. ‘తిన్న తర్వాత ఓ 10 ని.లు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గోరు వెచ్చని నీళ్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత ఓ 30 ని.లు పడుకోకుండా ఉంటే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉండవు. సోంపు లేదా వాము నమిలితే బాగా జీర్ణమై మలబద్ధకం తగ్గుతుంది. కొద్దిసేపు నిటారుగా కూర్చున్నా మంచిదే’ అని తెలిపారు.
News March 24, 2025
కోడుమూరు ఘటన.. వార్డెన్ సస్పెండ్

కర్నూలు జిల్లా కోడుమూరులోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ జి.రాముడును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. బాలుర వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి మహేశ్.. రాజు, జె.ఇసాక్ అనే స్టూడెంట్లపై భౌతికంగా దాడికి పాల్పడిన <<15871409>>వీడియో<<>> సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై విచారణ అనంతరం వార్డెన్ రాముడిని సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదైంది.
News March 24, 2025
బెల్లంపల్లి: భార్యాభర్తలకు 6 నెలల జైలు శిక్ష

బెల్లంపల్లిలోని ముఖేశ్ డ్రెస్సెస్‌లో దొంగతనానికి పాల్పడిన భార్యాభర్తలు భద్రుద్ధీన్, ఆస్పియా షేరిన్‌లకు 6 నెలల జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానాను విధిస్తూ బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముఖేశ్ సోమవారం తీర్పునిచ్చారు. 2022 నవంబర్‌లో షాపులో దొంగతనం చేయగా దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు 1 టౌన్ SHO తెలిపారు. వారిని కోర్టులో హాజరుపర్చడంతో నేరం రుజువుకాగా వారికి శిక్ష విధించారు.