News May 26, 2024
కేవిబిపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కేవిబిపురం మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. కర్లపూడి గ్రామానికి చెందిన జావిద్ బేగ్(19) ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇంటి నుంచి బైక్‌పై శ్రీకాళహస్తికి బయలు దేరిన జావిద్.. కర్లపూడి దాటిన తరువాత బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాయిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ లోకనాథం తెలిపారు.
Similar News
News February 14, 2025
చిత్తూరు: ‘ధర్నాకు అనుమతులు లేవు’

చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా పాత బస్టాండ్ ప్రాంతంలో శుక్రవారం వైసీసీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్తూరు టౌన్ డీఎస్పీ సాయినాథ్ స్పందిస్తూ ధర్నాకు పోలీసులు ఎటువంటి ముందస్తు అనుమతులు ఇవ్వలేదన్నారు. ధర్నాకు హాజరు కావాలని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను అనుసరించి ధర్నాకు సహకరించిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని గురువారం డీఎస్పీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
News February 13, 2025
బైరెడ్డిపల్లి: సూసైడ్ లెటర్ రాసి అదృశ్యమైన యువకుడు

బైరెడ్డిపల్లికి చెందిన మేస్త్రి కృష్ణప్ప కుమారుడు విశ్వనాథ్ సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నాన్న.. నా భార్య, కూతురును బాగా చూసుకోండి. నేను చనిపోయాక వచ్చే చంద్రన్న బీమా, ఇన్సూరెన్స్ నగదు నేను ఇవ్వాల్సిన అప్పుల వాళ్లకు ఇచ్చి మిగిలిన డబ్బులు నా భార్య బిడ్డలకు ఇవ్వండి’ అని లెటర్‌లో రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు తన తండ్రి తెలిపాడు.
News February 13, 2025
సదుం: జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపిక

జాతీయ కబడ్డి సీనియర్ మహిళా విభాగం జట్టుకు సదుం కబడ్డీ క్లబ్ క్రీడాకారులు గుల్జార్, రుక్సానా ఎంపికైనట్టు చిత్తూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ రవీంద్ర రెడ్డి గురువారం తెలిపారు. డిసెంబర్లో ప్రకాశం జిల్లాలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపడంతో వారు ఎంపిక అయినట్లు ఆయన తెలిపారు. హర్యానాలో జరిగే జాతీయస్థాయి కబడ్డీ క్రీడా పోటీల్లో ఏపీ తరఫున వారు పాల్గొంటారని పేర్కొన్నారు.