News February 6, 2025

కేశంపేట: శివస్వాములకు ముస్లిం సోదరుల అన్నదానం

image

HYD శివారు షాద్‌నగర్ సమీపంలోని కేశంపేట మండలంలోని వేములనర్వ శివాలయంలో శివ స్వాములకు ఎండీ మహమ్మద్ ఆధర్యంలో ముస్లిం సోదరులు అన్నదానం చేశారు. మతసామరస్యం చాటుకున్న సల్వార్, ఆఫీజ్, జహంగీర్‌బాబా, ఇమ్రాన్‌కు శివస్వాములు శ్రీకాంత్, గణేశ్, మహేశ్, భిక్షపతి, అశోక్, బాలరాజు, రాఘవేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News

News November 11, 2025

వరంగల్: శాఖల మధ్య సమన్వయం లోపం.. వారికి బంపర్ ఆఫర్

image

2024 DSC టీచర్ పోస్టులు, స్పోర్ట్స్ కోటా SGTపోస్టుల నియామకాల్లో జాతీయ క్రీడాకారులకు అన్యాయం చేశారనే ఆరోపణలపై ప్రభుత్వం ఇటీవల రీవెరిఫికేషన్‌కు ఆదేశించింది. విచారణలో 22మంది అనర్హులని తేలింది. విద్యా, స్పోర్ట్స్ శాఖల మధ్య సమన్వయ లోపంతో అర్హత లేనివారు కొలువు చేస్తున్నారు. నివేదికను బయటపెడితే అక్రమార్కుల జాబ్స్ తీసేయాల్సి వస్తుందనే నెపంతో ఈ ఫైల్‌ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

News November 11, 2025

నెల్లూరు కలెక్టరేట్‌లో మౌలానాకు నివాళి

image

నెల్లూరు కలెక్టరేట్‌లో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవం జరిగింది. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ హిమాన్షు శుక్లా నివాళి అర్పించారు. దేశంలో విద్యావ్యవస్థకు సంస్కరణలతో అబుల్ కలామ్ బాటలు వేశారని తెలిపారు.

News November 11, 2025

భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్ జిల్లాలో ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య <<18257519>>ఎదురు కాల్పులు<<>> జరుగుతున్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆరుగురు మావోల మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.