News February 6, 2025

కేశంపేట: శివస్వాములకు ముస్లిం సోదరుల అన్నదానం

image

HYD శివారు షాద్‌నగర్ సమీపంలోని కేశంపేట మండలంలోని వేములనర్వ శివాలయంలో శివ స్వాములకు ఎండీ మహమ్మద్ ఆధర్యంలో ముస్లిం సోదరులు అన్నదానం చేశారు. మతసామరస్యం చాటుకున్న సల్వార్, ఆఫీజ్, జహంగీర్‌బాబా, ఇమ్రాన్‌కు శివస్వాములు శ్రీకాంత్, గణేశ్, మహేశ్, భిక్షపతి, అశోక్, బాలరాజు, రాఘవేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News

News December 2, 2025

HYD: సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి స్లాట్స్

image

సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకు పెరిగిపోతుంది. అవినీతిని అరికట్టేందుకు తెచ్చిన స్లాట్ బుకింగ్‌ను అక్రమార్కులు తమ దందాకు వాడుకుంటున్నారు. HYD పరిధిలోని 45 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇది సాగుతోంది. లాగిన్ ఐడీలను క్రియేట్ చేసి అవసరం లేకుండా స్లాట్ బుక్ చేస్తున్నారు. అత్యవసరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచి ఎక్కువ డబ్బులు లాగుతూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ప్రజలు తెలిపారు.

News December 2, 2025

GHMC: దీర్ఘకాలిక సేవల కోసం HMWSSB ప్రణాళికలు

image

GHMCలో శివారు మున్సిపాలిటీల విలీనంతో HMWSSB పరిధి కూడా పెరగనుంది. దీంతో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ తన సేవలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనంతో తాగునీరు, సీవరేజ్, డ్రైనేజి లైన్ నిర్వహణ భారంగా మారనుంది. కొత్తగా లైన్ ఏర్పాటు చేయడంతో పాటు, పాతవాటికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. 2047 వరకు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.

News December 2, 2025

HYD: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

image

కోవైట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న ఇండిగో (6e 1234) విమానానికి బాంబు బెదిరింపు మేయిల్ వచ్చింది. అర్దరాత్రి 1:30 నిమిషాలకు బయలుదేరిన విమానం ఉదయం 8:10 శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు విమానం చేరుకుంది. బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు. ముంబయిలో ఇంకా ల్యాండింగ్ కానీ విమానం భయం గుప్పెట్లో ఫైలెట్ తోపాటు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.