News February 6, 2025
కేశంపేట: శివస్వాములకు ముస్లిం సోదరుల అన్నదానం

HYD శివారు షాద్‌నగర్ సమీపంలోని కేశంపేట మండలంలోని వేములనర్వ శివాలయంలో శివ స్వాములకు ఎండీ మహమ్మద్ ఆధర్యంలో ముస్లిం సోదరులు అన్నదానం చేశారు. మతసామరస్యం చాటుకున్న సల్వార్, ఆఫీజ్, జహంగీర్‌బాబా, ఇమ్రాన్‌కు శివస్వాములు శ్రీకాంత్, గణేశ్, మహేశ్, భిక్షపతి, అశోక్, బాలరాజు, రాఘవేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News March 19, 2025
మా పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ చట్టం: మందకృష్ణ

మూడు దశాబ్దాల పాటు ఎస్సీ వర్గీకరణపై తాము చేపట్టిన పోరాట ఫలితమే వర్గీకరణకు చట్ట రూపం దాల్చిందని పద్మశ్రీ మందకృష్ణ మాది అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన క్లబ్‌లో మాట్లాడుతూ.. వర్గీకరణ చట్ట రూపం దాల్చడంతో నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సభలు, విజయోత్సవం నిర్వహిస్తామన్నారు. చట్టం మా చేతిలో పెట్టి ఉద్యోగాలన్నీ వారికి దోచి పెట్టారన్నారు.
News March 19, 2025
HYD: వ్యర్థాలను నిల్వ చేసిన వ్యక్తి ARREST

మంగళ్‌హాట్‌లోని చమన్‌దర్గా వద్ద దుకాణంలో మాంసపు వ్యర్థాలను నిల్వ చేస్తున్న మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తిని టాస్క్‌ఫోర్స్, సౌత్‌వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.8 లక్షల విలువైన 12 టన్నుల బరువుగల పాయా, తల, మెదడు, కిడ్నీ, మేక, గొర్రెల లివర్, ఇతర పశువుల మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. నిందితుడు ఈ వ్యర్థాలను ఎవరెవరికి అమ్ముతున్నారనేది విచారణ తర్వాత చెబుతామని అధికారులు తెలిపారు.
News March 19, 2025
HYD: మంత్రి సీతక్క పేరుతో నకిలీ MLA స్టిక్కర్

హైదరాబాద్ నకిలీ MLA స్టిక్కర్ వేసుకొని సంచరిస్తున్నారు. తాజాగా మంత్రి సీతక్క పేరుతో ఉన్న నకిలీ స్టిక్కర్ వాహనం (TG 09 HT R 1991)THARపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. మంత్రి పీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కార్ సీజ్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.