News February 10, 2025
కేసముద్రంలో నాలుగు కిలోల గంజాయి పట్టివేత

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 4కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ సర్వయ్య తెలిపిన వివరాలిలా.. నమ్మదగిన సమాచారం మేరకు 3 వ్యక్తులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని తెలిసింది. దీంతో ఎస్సై మురళీధర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద తనిఖీ చేయగా 4కిలోల గంజాయి దొరికిందని సీఐ తెలిపారు.
Similar News
News November 3, 2025
బస్సు ప్రమాదం.. ప్రభుత్వం పరిహారం ప్రకటన

TG: రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అంతకుముందు కేంద్రం <<18184274>>పరిహారం<<>> ప్రకటించింది.
News November 3, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 160 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 160 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 77, సెంట్రల్ జోన్ పరిధిలో 26, వెస్ట్ జోన్ పరిధిలో 28 ఈస్ట్ జోన్ పరిధిలో 29 కేసులు నమోదు అయ్యాయి.
News November 3, 2025
ప్రతీగ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలి: కలెక్టర్

ప్రతి గ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నీరు, పారిశుద్ధ్య కమిటీ సమావేశం సమావేశం జరిగింది. పారిశుద్ద్య నిర్వహణకు పెద్ద పీట వేయాలని, ఎక్కడా బహిరంగ మల విసర్జన లేకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. బహిరంగ మల విసర్జన రహిత (ఓ.డి.ఎఫ్) గ్రామాలుగా గతంలో ప్రకటించిన గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి పరిస్థితులను గమనించాలన్నారు.


