News August 27, 2024

కేసముద్రం: కోడలే కొడుకై.. మామకు తలకొరివి పెట్టింది!

image

ఆఖరి మజిలీలో ఆ వృద్ధుడికి కొడుకు లేని లోటును కోడలు తీర్చింది. మామకు ఇచ్చిన మాట ప్రకారం తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య(90) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. గతంలో వెంకటయ్య ఇద్దరు కుమారులు అనారోగ్యంతో చనిపోవడంతో పెద్ద కోడలు యాకమ్మ మామ వెంకటయ్యకు తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది.

Similar News

News September 10, 2024

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రావీణ్య

image

వంగరలోని ఉన్నత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేడు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అన్ని విభాగాలను సందర్శించి వాటికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వైద్య ఆరోగ్య సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు.

News September 10, 2024

మేడారంలో శాశ్వత పనులకు ప్రతిపాదన సిద్ధం చేయాలి: కలెక్టర్

image

మేడారం జాతరకు శాశ్వత అభివృద్ధి పనుల ప్రతిపాదన సిద్ధం చేయాలని ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీతతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మేడారం జాతరలో భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్లలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. గద్దెల ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా నిర్వహించాలన్నారు.

News September 10, 2024

వరంగల్‌లో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ

image

వరంగల్ నగరంలో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. మంగళవారం నిమజ్జనానికి సంబంధించిన చెరువులను, పరిసర ప్రాంతాలను సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి నందిరాం నాయక్, CI గోపి, సిబ్బంది పాల్గొన్నారు.