News August 10, 2024
కేసముద్రం: మహిళా వేషధారణలో వ్యక్తి పర్యటన
మహిళా వేషధారణ వేసుకొని ఓ వ్యక్తి కేసముద్రంలో పర్యటిస్తున్నాడు. ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంట్లోకి చొరబడి డబ్బులు అడగాడు. దీంతో ఆమె భయంతో బయటికి పరుగులు తీసింది. ఇది గమనించిన స్థానికులు అతడిని విచారించారు. నాందేడ్ వాసిగా గుర్తించారు. అతడు బిక్షాటనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతని వద్ద కొడవలి ఉన్నట్లు స్థానికలు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 20, 2024
వరంగల్: ఎంజీఎంను గాడిన పెట్టేందుకు చర్యలు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని గాడిన పెట్టేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కలెక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీలు, అడపా దడపా మంత్రుల రివ్యూలతో ఎంజీఎంలో అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ ఏర్పడుతోంది. ఇప్పటికే ఎంజీఎంలో పదికి పైగా ఫిర్యాదుల పెట్టేలను ఏర్పాటు చేశారు. వాటిని కలెక్టర్ స్వయంగా తెరిచి సమస్యలు తెలుసుకోనున్నారు. ఓపీ కౌంటర్లను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News September 20, 2024
వరంగల్: తగ్గుతున్న పత్తి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మళ్లీ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. బుధవారం రూ.7,810కి పడిపోయింది. గురువారం కొంత పెరిగి రూ. 7,850 చేరగా నేడు మళ్లీ తగ్గి రూ.7,825 అయిందని అధికారులు తెలిపారు. పత్తి ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.
News September 20, 2024
కేయూ కాంట్రాక్టు లెక్చరర్‌పై మరో ఫిర్యాదు
కేయూ కాంట్రాక్టు లెక్చరర్ శ్రీధర్ కుమార్ లోథ్‌పై మరో మహిళ పార్ట్ టైమ్ లెక్చరర్ ఫిర్యాదు చేశారు. బదిలీ విషయంలో వేధిస్తూ అడ్డుకుంటున్నాడని తెలుగు డిపార్ట్‌మెంట్ లెక్చరర్ అన్నపూర్ణ అతడిపై గురువారం రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు ఇచ్చారు.కాగా ఈ నెల 16న తెలుగు డిపార్ట్‌మెంట్ HOD జ్యోతి తనను శ్రీధర్ కుమార్ లోథ్ మానసికంగా వేధిస్తున్నాడని రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే అతడికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.