News February 17, 2025
కేసముద్రం: మిర్చికి మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలి: సీపీఎం

మిర్చికి మద్దతు ధర క్వింటాకు రూ.25,000 ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పాపారావు అన్నారు. మిర్చిని మార్క్ ఫెడ్, నాబార్డు సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సవరించి, అన్ని వర్గాలకు సమాన వాటాలు దక్కేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 18న మండల కేంద్రాల్లో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమంలో అన్ని వర్గాల వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Similar News
News March 15, 2026
LPG కంటే PNG బెటర్ అంటున్న నిపుణులు!

దేశ ప్రజలు ఎల్పీజీ కాకుండా PNG (పైప్డ్ నేచురల్ గ్యాస్)వైపు మళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. మన దేశానికి దిగుమతి అయ్యే LPGలో 90% హార్ముజ్ నుంచే వస్తోంది. ఇప్పుడది క్లోజ్ కావడంతో ఇబ్బందులు వస్తున్నాయి. అయితే LPGతో పోలిస్తే PNGకి డిమాండ్ తక్కువగా ఉంది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి కొరత వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
News March 15, 2026
పెద్దపల్లి: ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాలు: ఎస్ఈ

విద్యుత్ సరఫరాలో ప్రకృతి విపత్తులు లేదా సాంకేతిక కారణాల వల్ల ఏర్పడే అంతరాయాలను త్వరగా పరిష్కరించేందుకు పెద్దపల్లి సర్కిల్ పరిధిలో ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ (ERT)వాహనాలను వినియోగిస్తున్నట్లు SE వి.గంగాధర్ తెలిపారు. సర్కిల్ పరిధిలో 2 ERT వాహనాలు, సబ్‌డివిజన్ స్థాయిలో 7 వాహనాలు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. విద్యుత్ సమస్యలపై వినియోగదారులు 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలన్నారు.
News March 15, 2026
కామారెడ్డి: ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణలో మార్పులు

కామారెడ్డి జిల్లాలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ విధానంలో మార్పులు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జనగణన-2027 శిక్షణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను కలెక్టరేట్‌లోని 25వ నంబర్ గదిలో స్వీకరించనున్నట్లు వివరించారు.


