News June 29, 2024
కేసముద్రం: రూ.30.38 కోట్ల బియ్యం మాయం!

కేసముద్రం మండల పరిధిలోని రైస్ మిల్లుల్లో శుక్రవారం టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ తనిఖీల్లో ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. CMR కింద ధాన్యాన్ని మర పట్టించి ప్రభుత్వానికి అందించాల్సిన రు.30.38 కోట్ల విలువ చేసే బియ్యాన్ని మిల్లర్లు మాయం చేసినట్లు అధికారులు తేల్చారు. ఆయా మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లై డీఎం కృష్ణవేణి తెలిపారు.
Similar News
News November 28, 2025
‘టీఈ-పోల్’ యాప్ వినియోగించండి: వరంగల్ కలెక్టర్

ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారం సులభంగా చేరేందుకు రూపొందించిన టీఈ-పోల్ మొబైల్ యాప్ను వినియోగించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడిన ఆమె, గూగుల్ స్టోర్లో యాప్ అందుబాటులో ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రం, ఓటర్ స్లిప్ వంటి వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.
News November 27, 2025
వరంగల్: కొత్త విత్తన బిల్లుపై అభిప్రాయాలు సేకరించిన కలెక్టర్

కొత్త విత్తన బిల్లు-2025 ముసాయిదాపై రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారుల అభిప్రాయాలను సేకరించామని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఈరోజు వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశంలో బిల్లులోని సెక్షన్లు, క్లాజులపై విస్తృతంగా చర్చించారు. హాజరైన వాటాదారులు ప్రతి అంశంపై తమ సూచనలు తెలియజేశారు. వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
News November 27, 2025
Te-Poll యాప్ను డౌన్లోడ్ చేసుకోండి: వరంగల్ కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పూర్తి సమాచారాన్ని వేగంగా, సులభంగా అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి వంటి కీలక సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్ ఇది అని పేర్కొన్నారు.


