News March 8, 2025

కేసముద్రం: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

కేసముద్రం – ఇంటికన్నె రైల్వే స్టేషన్ మధ్య ఓ గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతిచెందాడు. మృతి చెందిన వ్యక్తికి 35-40 సంవత్సరాల వయసు ఉంటుందని వరంగల్ జీఆర్పీ పోలీసులు తెలిపారు. వ్యక్తి గుర్తులు బ్లూ కలర్ ప్యాంటు, పసుపు రంగు టీ షర్టు ధరించి, ఛాతిపై వీటీ అనే అక్షరాలు పచ్చబొట్టు ఉన్నట్లు పేర్కొన్నారు. అతడి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు.

Similar News

News October 22, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 22, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.03 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 22, 2025

త్వరలో హోంగార్డు పోస్టుల భర్తీ: DGP

image

TG: త్వరలోనే హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. క్రిమినల్ <<18056923>>రియాజ్‌<<>>ను పట్టుకునే క్రమంలో గాయపడిన సయ్యద్ ఆసిఫ్‌‌ను ఆయన పరామర్శించారు. రూ.50వేల రివార్డ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసిఫ్ వల్లే రియాజ్‌ను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఆసిఫ్‌కు హోంగార్డు ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

News October 22, 2025

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లా వాసి

image

తొండూరు మండలం భద్రంపల్లెకు చెందిన ఈశ్వరయ్య సీపీఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గుజ్జుల ఈశ్వరయ్య ప్రాథమిక విద్య చదువుతుండగా.. విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాను, రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ ఉపాధ్యక్షునిగా సమస్యలపై, నిరుద్యోగ సమస్యపై సమస్యల పోరాటాలు నిర్వహించారు.