News February 6, 2025
కేసముద్రం: రైలు నుంచి జారి పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

రైలు నుంచి జారి పడి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. పరకాలకు చెందిన అరవింద్ అనే యువకుడు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడ్డాడు. దీంతో అరవింద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 26, 2025
ఏలూరు : ముళ్ల పొదల్లో పసికందు.. మృతి

తూ.గో జిల్లాలో పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువును కుక్కలు పీకుతుండగా.. స్థానికులు గుర్తించి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే శిశువు చికిత్స పొందుతూ రా.12 గం.లకు మరణించిందని సీడీపీఓ నాగలక్ష్మి తెలిపారు. ఘటనపై FIR చేయించామని, వివరాల సేకరణకు అంగన్వాడీ సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు.
News March 26, 2025
RKP: యువకుడిపై పోక్సో కేసు నమోదు: SI

రామకృష్ణాపూర్‌కు చెందిన బాలిక(10) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ధృవకుమార్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూడడానికి అలవాటుపడ్డ యువకుడు నీటి సీసా కోసం వచ్చిన బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.
News March 26, 2025
టేకులపల్లిలో వడదెబ్బకు రైతు మృతి

వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన టేకులపల్లి మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మద్రాస్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో గల కొండంగుల బోడుకి చెందిన కేలోతు గోబ్రియా అనే రైతు వడదెబ్బతో మృతి చెందారు. ఆయన సోమవారం తన పొలంలో పండించిన కూరగాయలు, నువ్వులు కోయడానికి వెళ్లి ఎండ దెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద మృతి చెందాడు.