News February 26, 2025
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు 5 రోజులు సెలవులు..

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు నేటి నుంచి మార్చి 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26 శివరాత్రి, 27 మహాశివరాత్రి జాగరణ, 28 అమావాస్య, 1 వారాంతపు సెలవు, 2 ఆదివారం వారాంతపు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు గమనించాలని కోరారు.
Similar News
News March 18, 2025
భోగాపురంలో బాంబు పేలి కార్మికుడి మృతి

భోగాపురంలో రాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన బాంబు పేలి కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా రహదారి ఏర్పాటుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే క్రమంలో బాంబులు పెడుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామచంద్రపేటకు చెందిన కార్మికుడు కొత్తయ్య మృతి చెందాడు.
News March 18, 2025
అంతరిక్షం నుంచి వచ్చాక స్ట్రెచర్లపైనే బయటకు..

స్పేస్ ఎక్స్ క్రూ క్యాప్సుల్‌లో రేపు తెల్లవారుజామున భూమిపైకి రానున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌పై అందరి దృష్టి నెలకొంది. క్యాప్సుల్ తెరుచుకున్న వెంటనే వీరిని స్ట్రెచర్స్‌లో బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. స్పేస్ నుంచి ఒక్కసారిగా భూమిపైకి రావడం, అంతరిక్షంలో నెలల పాటు ఉండటంతో వీరి శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం కారణమని నిపుణులు చెబుతున్నారు. వీరు నడవలేని స్థితిలో ఉంటారని అంటున్నారు.
News March 18, 2025
‘బుడమేరు’కు శాశ్వత పరిష్కారం: మంత్రి

AP: గతేడాది విజయవాడను ముంచేసిన బుడమేరు వాగుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు ప్రారంభించామని మంత్రి నిమ్మల తెలిపారు. ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నిధుల విడుదలకు మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు సరస్సు వరకు కాలువల ప్రవాహ మార్గం సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కులకు పెంచుతామన్నారు.