News April 9, 2025
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ఉత్పత్తుల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. ✓ ధాన్యం(RNR): గరిష్ఠం: 2489. కనిష్ఠం: 1859. ✓ పత్తి: గరిష్ఠం: 7289. కనిష్ఠం: 5611. ✓ మక్కలు: గరిష్ఠం: 2236. కనిష్ఠం: 1850. ✓ తేజా మిర్చి: గరిష్ఠం: 12,600. కనిష్ఠం: 8002. ✓ తేజా తాలు: గరిష్ఠం: 5811. కనిష్ఠం: 5502. ✓ కందులు: గరిష్ఠం: 6689. కనిష్ఠం: 6069.✓ పేసర్లు: గరిష్ఠం: 7239. కనిష్ఠం: 6089.
Similar News
News December 14, 2025
పాలమూరు: మెస్సీ మీద ఉన్న ప్రేమ BCలపై లేదు: మాజీ మంత్రి

రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఆటగాడు మెస్సీపై ఉన్నంత ప్రేమ బీసీల మీద లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నా, రేవంత్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. నల్గొండ జిల్లాలో బీసీ వ్యక్తికి జరిగిన అవమానంపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
News December 14, 2025
కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.
News December 14, 2025
అనంతపురం: ‘1100 నంబర్కు కాల్ చేయొచ్చు’

పీజీఆర్ఎస్లో సమర్పించిన అర్జీలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.in వెబ్సైట్లో కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు.


