News February 17, 2025

కేసీఆర్‌కు కరీంనగర్‌తో విడదీయరాని బంధం

image

కరీంనగర్ అంటేనే.. కేసీఆర్ అని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు చెప్పుకుంటాయి. KCRకు KNR జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. ప్రత్యేక తెలంగాణే ధ్యేయంగా టీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటుచేయనున్నట్లు 2001లో KNR గడ్డపైనే ప్రకటించారు. 2004లో KNR నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2018, మే 10న రైతుబంధును ఇక్కడే ప్రారంభించారు. త్వరలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను కరీంనగర్‌లోనే ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. దీనిపై మీ కామెంట్.

Similar News

News October 19, 2025

విశాఖ మ్యూజియం ఎప్పుడైనా సందర్శించారా?

image

విశాఖ మ్యూజియం నగర వాసులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. దీనిని అప్పటి CM జనార్దన్ రెడ్డి 1991లో ప్రారంభించారు. డచ్ భవనంలో ఉన్న మారిటైమ్ మ్యూజియంలోని 10 గదుల్లో నేవీ ఉపయోగించిన ఆయుధాలు, నేవీ చేసిన యుద్దాల సమచారాన్ని కళాఖండాల రూపంలో ప్రదర్శించారు. అదేవిధంగా విశాఖ మ్యూజియం వెనుక ఉన్న రెండంతస్థుల భవనాన్ని హెరిటేజ్ మ్యూజియంగా మార్చారు. ఇందులో పురావస్తు విభాగానికి చెందిన 5 గ్యాలరీలు కలవు.

News October 19, 2025

తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా!

image

తాళ్లపూడి మండల వ్యాప్తంగా చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో కిలో చికెన్ కిలో రూ.200 – 220 మధ్య విక్రయిస్తున్నారు. నాటుకోడి కిలో రూ.600, మేక మాంసం కిలో రూ.800 వద్ద అమ్మకాలు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కావడం, స్వామి మాలధారులు పెరగడంతో వచ్చే వారం చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

News October 19, 2025

నేడు HYDలో సీఎం పర్యటన వివరాలిలా..

image

నేడు సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రాంతల్లో పర్యటించనున్నారు. ఉ.11.30కు చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమల్లో హాజరవుతారు. 12 గంటలకు NTR స్టేడియం ఎదురుగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శిల్పకళా వేదికలో శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు అందించే కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు.