News April 1, 2025
కేసీఆర్తో వరంగల్ బీఆర్ఎస్ నేతల భేటీ

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు వారంతా కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సభా నిర్వహణకు సంబంధించి అధినేత నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. పార్టీ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేస్తామని వారంతా ముక్తకంఠంతో పార్టీ అధినేతకు హామీ ఇచ్చారు.
Similar News
News December 3, 2025
కోకాపేటలో ఎకరం రూ.131 కోట్లు

కోకాపేట్ నియోపోలిస్ భూముల వేలం ముగిసింది. నగరానికి చెందిన యూలా గ్రూప్ నాలుగు ఎకరాల ప్లాటును వేలంలో సొంతం చేసుకుంది. ఎకరానికి రూ.131 కోట్లు వెచ్చించింది. నియోపోలిస్ నుంచి గండిపేట్ వ్యూ కనిపిస్తుండటంతో ఇక్కడి కమ్యూనిటీని డెవలప్ చేసే అవకాశం ఉంటుందని, అందుకే ఈ నాలుగు ఎకరాలను ఆన్లైన్ వేలంలో యూలా గ్రూప్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.
News December 3, 2025
గ్లోబల్ సమ్మిట్కు చార్టెడ్ ఫ్లైట్లలో ప్రముఖులు

గ్లోబల్ సమ్మిట్కు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం ఏకంగా 3 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. 50 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ హెలిప్యాడ్ల ద్వారా సుమారు 500 మంది ప్రముఖ అతిథులను రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఈవోలు, సినీ తారలు సహా పలువురు ప్రముఖులు చార్టెడ్ ఫ్లైట్లలో ఇక్కడికి చేరుకుంటారని అధికారులు Way2Newsకు తెలిపారు.
News December 3, 2025
MCA విద్యార్థులకు గమనిక.. పరీక్షలు ఎప్పుడంటే!

ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ MCA 3వ సెమిస్టర్ పరీక్షల తేదీని వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 4 నుంచి (గురువారం) పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. వీటితోపాటు బ్యాక్ లాగ పరీక్షలు కూడా నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగం అధిపతి ప్రొ.శశికాంత్ తెలిపారు.పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ కోసం ఉస్మానియా వెబ్ సైట్ http://www.oucde.net/ చూడవచ్చు.


