News June 25, 2024
కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

BRS అధినేత కేసీర్ను ఎర్రవెల్లిలోని వారి నివాసంలో మంగళవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దండేవిఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి కేసీఆర్ను కలిసిన వారిలో ఉన్నారు.
Similar News
News October 31, 2025
మెదక్: ‘మహిళల, బాలికల భద్రతకే షీ టీమ్స్’

మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. వేధింపులకు గురైనవారు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెలలో జిల్లాలో 17 ఎఫ్ఐఆర్లు, 13 ఈ-పిటి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే 69 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 88 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.
News October 31, 2025
తూప్రాన్: మళ్లీ కనిపించిన పులి

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి మళ్లీ శుక్రవారం కనిపించింది. మల్కాపూర్ – దాతర్ పల్లి మార్గమధ్యలో గుండుపై సేద తీరుతూ శుక్రవారం ఉదయం కనిపించింది. బుధవారం కనిపించిన ప్రదేశంలోనే మళ్లీ పులి కనిపించడంతో అక్కడే మకాం వేసినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
News October 31, 2025
నర్సాపూర్ అర్బన్ పార్కులో రేపు కాటేజీలు ప్రారంభం

మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని రూ. 20 కోట్లతో ఏర్పాటు చేసిన నర్సాపూర్ అర్బన్ పార్కులో నిర్మించిన కాటేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ కాటేజీలను శనివారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గొంటారు. ఈ ప్రారంభంతో సందర్శకుల రద్దీ, రాత్రి బస చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.


