News November 19, 2024
కేసీఆర్ అంటే ఒక చరిత్ర: హరీశ్ రావు
కేసీఆర్ అంటే ఒక చరిత్ర అని.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అద్భుతంగా అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రాత్రి కేసీఆర్ ఫ్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి హీరో రజనీకాంత్ న్యూయార్క్‌లో ఉన్నానా.. ఇండియాలో ఉన్నానా అన్నాడన్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా KCR అభివృద్ధి చేశాడన్నారు.
Similar News
News December 14, 2024
మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. రామాయపల్లి గ్రామానికి చెందిన కటికల రేణుక (40) సమీపంలోని ఇండూస్ మెడికేర్ కంపెనీలో కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈరోజు ఉదయం కంపెనీకి వెళ్తుండగా గ్రామ చౌరస్తా వద్ద బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే రేణుక మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని తూప్రాన్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
News December 14, 2024
మెదక్: నేడు మంత్రి కొండా సురేఖ పర్యటన
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో శనివారం రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నారు. మండల పరిధిలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్‌ను మంత్రి సందర్శిస్తారని అధికారులు తెలిపారు. అర్బన్ పార్క్‌లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు.
News December 13, 2024
మెదక్: శిథిలావస్థలోని ఇళ్ల వివరాలను సేకరించాలి: కలెక్టర్
చిన్నశంకరంపేట మండలం మాందాపూర్ గ్రామంలో కొన్నసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన పురాతన ఇళ్లలో నివాసముంటున్న వారు కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు వస్తే వారి వివరాలను సైతం యాప్లో పొందుపర్చాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే అత్యంత పారదర్శకంగా కొనసాగుతుందని ఆయన అన్నారు.