News February 17, 2025

కేసీఆర్‌ అంటే తెలంగాణ ఉద్వేగం: హరీశ్‌రావు

image

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 71వ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. ‘కేసీఆర్‌ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, జై తెలంగాణ యుద్ధ నినాదం, తెలంగాణ సమున్నత అస్తిత్వం అన్నారు. మీరు శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ హరీశ్ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

Similar News

News April 12, 2026

MDK: సాసర్ పిట్స్‌తో దాహం తీర్చుతున్న అటవీ శాఖ

image

మెదక్ జిల్లాలో ఎండల తీవ్రతతో అడవుల్లో వాగులు ఎండిపోవడంతో వన్యప్రాణులు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన ‘సాసర్ పిట్స్’ (సిమెంట్ కుంటలు) జంతువులకు ప్రాణాధారంగా మారాయి. కెమెరా ట్రాప్‌లలో చిరుతలు, జింకలు నీరు తాగుతున్న దృశ్యాలు నమోదవుతున్నాయి. ఈ కుంటలు జంతువులు గ్రామాల వైపు రాకుండా అడ్డుకుంటూ రక్షణ కల్పిస్తున్నాయి. అధికారులు నిరంతరం నీరు నింపుతూ పర్యవేక్షిస్తున్నారు.

News April 12, 2026

మెదక్‌: ప్రజావాణి కార్యక్రమం వాయిదా: కలెక్టర్

image

ఈ నెల 13న (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభల పనుల్లో అధికారులు నిమగ్నమై ఉండటంతో కలెక్టరేట్, మున్సిపాలిటీలు, తహశీల్దార్ కార్యాలయాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే స్వీకరిస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు.