News November 8, 2024
కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు రేవంత్ రెడ్డి: హరీశ్‌రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు.. సీఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావ్ అంటూ రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. సుమతీ శతకానికి సంబంధించిన పద్యాన్ని హరీశ్‌రావు ట్వీట్ చేశారు.
Similar News
News December 12, 2024
చిదంబరం తెలంగాణ ప్రకటనకు కేసీఆరే కారణం: హరీశ్‌రావు
నాటి కేంద్ర మంత్రి చిదంబరం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ సత్యాన్ని ఏమార్చాలని కాంగ్రెస్ చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ గురించి సీఎం రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే నీ రెండు కళ్ళ సిద్ధాంతం గుర్తుకు వస్తుందని హరీశ్‌రావు తెలిపారు.
News December 12, 2024
రాజీమార్గమే రాజామార్గం: ఎస్పీ ఉదయ్
రాజీమార్గమే రాజామార్గం అని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీపడే కేసుల్లో రాజీ పడేటట్లు కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికాలకు సూచించారు. ఇద్దరు కొట్లాడితే ఒక్కరే గెలుస్తారు. రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని.. కక్షలతో ఏమీ సాధించలేమని అన్నారు. అదేరోజు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
News December 11, 2024
క్రీడా సమాఖ్య పోటీల్లో రాష్ట్ర జట్టు ప్రతిభ
వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో జరుగుతున్న క్రీడా సమాఖ్య పాఠశాల స్థాయి అండర్-14 వాలీబాల్ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు ప్రతిభ చూపుతున్నట్లు కోచ్ అల్లి నరేశ్ తెలిపారు. బాలుర విభాగంలో మొదటి మ్యాచ్ పంజాబ్(3-2)తో, రెండవ మ్యాచ్ ఢిల్లీ(3-0)తో విజయం సాధించినట్లు వివరించారు. విజయం పట్ల అధ్యక్షుడు నాగరాజు, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రమేష్, కిషోర్, దేవానంద్, హరిత, పుష్పవేణి హర్షం వ్యక్తం చేశారు.