News February 9, 2025
కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడు: సీతక్క

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడన్నారు. రైతును రాజు చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు.
Similar News
News November 7, 2025
పెద్దపల్లి: పాడైన పరికరాల తొలగింపునకు టెండర్ల ఆహ్వానం

పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పాడైన కంప్యూటర్లు, మానిటర్లు (405), CPUలు (285), కీబోర్డులు (218), మౌస్లు (105), యూపీఎస్లు (96), ప్రింటర్లు (6) వంటి E-Waste తొలగింపునకు టెండర్ దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తిగల కాంట్రాక్టర్లు తమ యూజ్డ్ E-Waste తొలగింపు టెండర్ ఫారమ్లు NOV 12వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి సమర్పించవలసిందిగా అధికారులు తెలిపారు.
News November 7, 2025
పెద్దపల్లి: సూపర్వైజర్లకు స్పష్టమైన దిశానిర్దేశం

పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డా. వాణిశ్రీ అధ్యక్షతన సూపర్వైజర్లతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య కార్యక్రమాల అమలులో సూపర్వైజర్లు కీలకపాత్ర వహించాలని ఆమె సూచించారు. గర్భిణీల ఎర్లీ రిజిస్ట్రేషన్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల ప్రోత్సాహం, మలేరియా-డెంగ్యూ నివారణ, NCD డేటా నమోదు, 100% టీకాల అమలుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 7, 2025
వరంగల్: రూ.1.27 కోట్ల ప్యాకేజీతో JOB

వరంగల్ ఎన్ఐటీలో శుక్రవారం జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో సీఎస్సీ ఫైనలియర్ చదువుతున్న నారాయణ త్యాగి అనే విద్యార్థి క్యాంపస్ సెలక్షన్లలో రూ.1.27 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. భారీ ప్యాకేజీతో ఎంపికైన నారాయణను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుభుతి, తోటి విద్యార్థులు అభినందించారు. ఈ ఘనతతో ఎన్ఐటీ వరంగల్ను దేశంలోని అగ్రశ్రేణి ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటిగా నిలబెట్టామని తెలిపారు.


