News February 9, 2025
కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడు: సీతక్క

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చాడన్నారు. రైతును రాజు చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు.
Similar News
News March 25, 2025
SLBC సొరంగం నుంచి మరో మృతదేహం వెలికితీత

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఈరోజు ఉదయం గుర్తించిన మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యూపీకి చెందిన ఇంజినీర్ మనోజ్ కుమార్‌గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. మొత్తం 8మంది టన్నెల్‌లో చనిపోగా ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాల్ని వెలికితీశారు. మరో ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.
News March 25, 2025
SKLM: కరెంట్ షాక్‌తో అటెండర్ మృతి

శ్రీకాకుళం జడ్పీ కార్యాలయం వెనుక ఉన్న గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం అటెండర్ మల్లారెడ్డి ఆనందరావు (46) మంగళవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కార్యాలయం ఆవరణలో మోటారు వేసేందుకు వెళ్లిన ఆయన షార్ట్ సర్క్యూట్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.
News March 25, 2025
నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం: రాజగోపాల్ రెడ్డి

TG: మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని, ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు. ఢిల్లీ నుంచి ఇంకా ఫోన్ రాలేదని తెలిపారు. ‘సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలి. భువనగిరి ఎంపీ ఎన్నికల బాధ్యతలు సమర్థంగా నిర్వహించా. నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం’ అని పేర్కొన్నారు.