News April 24, 2024

కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా డిపాజిట్ రాదు: మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా మోకాళ్ల యాత్ర చేసినా భువనగిరి, నల్గొండలో డిపాజిట్ దక్కదన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ దొరకదని త్వరలో తండ్రీ కొడుకులు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

Similar News

News October 15, 2025

NLG: జిల్లాకు కొత్తగా ఎనిమిది మంది ఎంపీడీవోలు

image

జిల్లాకు కొత్తగా 8 మంది ఎంపీడీఓలు రానున్నారు. ఇటీవల గ్రూప్-1 ద్వారా ఎంపికైన వారిలో జిల్లాకు 8 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం కేటాయించింది. అయితే వారిలో ముగ్గురు విధుల్లో చేరి తిరిగి HYDలో శిక్షణకు హాజరుకానున్నారు. మిగతా వారు ఇప్పటికే ఇతర శాఖల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నందున శిక్షణ అనంతరం ఆ శాఖలో రిలీవై ఎంపీడీవోలుగా విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. వీరి రాకతో జిల్లాలో ఎంపీడీఓల కొరత తీరనుంది.

News October 15, 2025

NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో మల్లన్న గుట్ట వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. మ్యాచింగ్ అయిన ధాన్యాన్ని వచ్చినట్లుగానే కొనుగోలు చేయాలని ఆమె ఆదేశించారు. రైతుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పీఏసీఎస్ సీఈవో బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

News October 14, 2025

NLG: ఏసీబీ జాన్తా నై.. మేమింతే..!

image

జిల్లాలో కొంతమంది అధికారులు బరితెగిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ ఒకటి ఉందని తెలిసినా.. భయం లేకుండా అవినీతికి పాల్పడుతున్న ఘటనలు జిల్లా ప్రజలను ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారులుగా మారుతుండడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 12 మందికి పైగానే ఏసీబీకి పట్టుబడ్డా.. అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు.