News April 18, 2025

కేసీఆర్ సెంటిమెంట్.. WGL, KNR మధ్యలో BRS సభ

image

KCR సెంటిమెంట్ జిల్లాలైన KNR, WGL జిల్లాల మధ్యలో ఈనెల 27న BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 20లక్షల మందితో 1500ఎకరాల్లో సభ ఏర్పాటు చేయనున్నారు. 50వేలకు పైగా వాహనాలు వస్తాయనే అంచనాతో 169ఎకరాలు సభకు, మిగతాదంతా(1,331) పార్కింగ్‌కు కేటాయించారు. 300 LED స్క్రీన్లు, 15లక్షల మజ్జిగ, 15లక్షల వాటర్ ప్యాకెట్లు, తాత్కాలిక ఆస్పత్రి, అంబులెన్సులు, 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Similar News

News December 17, 2025

వెల్గటూర్: డ్రా పద్ధతి ద్వారా వరించిన సర్పంచ్ పదవి

image

వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల గ్రామంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. గ్రామంలో సర్పంచ్ పదవికి నలుగురు అభ్యర్థులు బరిలో నిలువగా, ఇద్దరు అభ్యర్థులకు 155 ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికారులు డ్రా పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించగా.. కోటయ్య అనే వ్యక్తి సర్పంచ్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కోటయ్యను అదృష్టం వరించింది.

News December 17, 2025

విశాఖ: ఎస్ఐల బదిలీల్లో మార్పులు

image

నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన 102 మంది ఎస్ఐల బదిలీల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. బుధవారం 18 మంది ఎస్ఐల విన్నపం మేరకు వారిని ఇతర స్టేషన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయిన ఎస్ఐలందరూ వెంటనే తమకు కేటాయించిన కొత్త స్టేషన్లలో బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పారదర్శకత, పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

News December 17, 2025

జైపూర్ సర్పంచ్‌గా భాస్కర్ గెలుపు

image

జైపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కూన భాస్కర్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 187 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు.