News October 11, 2024
కేసీఆర్ 5వేల స్కూళ్లను మూసేశారు: సీఎం

TG: పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ విద్యపై దృష్టి పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతో దాదాపు 5వేల స్కూళ్లను మూసేశారని ఆరోపించారు. పేదలు చదువుకుంటే బానిసలుగా ఉండరనేది కేసీఆర్ ఆలోచన అని మండిపడ్డారు. తాము విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామని, విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని సీఎం వివరించారు.
Similar News
News November 27, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఇవాళ మధ్యాహ్నం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 30న వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది.
News November 27, 2025
సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం: పంత్

తాము సరిగ్గా ఆడలేదని ఒప్పుకోవడానికి సిగ్గు పడట్లేదని కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపారు. ‘జట్టుగా, వ్యక్తిగతంగా మేమెప్పుడూ హయ్యెస్ట్ లెవల్లో పర్ఫార్మ్ చేసి కోట్లమంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తేవాలనుకుంటాం. ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. ఈ జట్టు ఏం చేయగలదో మాకు తెలుసు. ఈసారి జట్టుగా, వ్యక్తిగతంగా మంచి కంబ్యాక్ ఇస్తాం’ అని ట్వీట్ చేశారు.
News November 27, 2025
భారీ వర్షాలు.. రైతులకు కీలక సూచనలు

భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రైతులకు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల వరి కోతల సీజన్ నడుస్తోంది. కోత పూర్తైన వరి పంటను/ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకు సూచించింది. ధాన్యాన్ని కుప్పలుగా పోసి టార్పాలిన్ కప్పాలని, ఒకవేళ వానకు ధాన్యం తడిస్తే రంగుమారకుండా, మొలకెత్తకుండా వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని కోరింది.


