News September 22, 2024
కేసీ కెనాల్ అధికారులపై మంత్రి ఆగ్రహం
నందికొట్కూరు మండలం మల్యాల గ్రామంలోని కేసీ కెనాల్ లాకుల వద్ద జలవనరుల శాఖ అధికారులు ఆదివారం గుర్రపు డెక్క, వినాయక నిమజ్జనం వ్యర్థాలు తొలగించారు. మంత్రి నిమ్మల రామానాయుడు వస్తున్న నేపథ్యంలోనే పనులు చేసినట్లు సమాచారం. కేసీ కెనాల్‌పై వెళ్తున్న మంత్రి తన కారు ఆపి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఏమి చేశారని ప్రశ్నించారు.
Similar News
News October 4, 2024
కర్నూలు: లా పరీక్ష ఫలితాల విడుదల
రాయలసీమ వర్సిటీ పరిధిలో జరిగిన (2023) లా మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వైస్ ఛాన్స్‌లర్ ఎన్టీకే నాయక్ విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సు మొదటి సెమిస్టర్‌లో 153 మంది, మూడో సెమిస్టర్‌లో 1,509 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐదేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్‌లో 32 మంది, మూడో సెమిస్టర్‌లో 37 మంది, మూడేళ్ల కోర్సు సప్లమెంటరీ మొదటి సెమిస్టర్‌లో 38 మంది, మూడో సెమిస్టర్‌లో 17 మంది ఉత్తీర్ణులయ్యారు.
News October 4, 2024
క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా ఓటరు జాబితా సర్వే: కమిషనర్
ఓటరు జాబితా సవరణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా సర్వే చేపట్టాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు బీఎల్ఓలను ఆదేశించారు. గురువారం నగరపాలక నూతన కౌన్సిల్ హాలులో బిఎల్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఫాం 6, 7, 8ల పూరింపులపై అవగాహన కల్పించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతకు కొత్త ఓటుకు ధరకాస్తు, చనిపోయినవారి ఓటు తొలగింపు, సవరణలు తప్పొప్పులు లేకుండా ప్రక్రియ చేయాలన్నారు.
News October 3, 2024
గ్రామపంచాయతీలో రైతుబజార్ల ఏర్పాటు: కలెక్టర్
RIDF, నాబార్డ్ గ్రాంట్ కింద గ్రామపంచాయతీలో రైతు బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో RIDF, నాబార్డ్ గ్రాంట్ బేస్డ్ ప్రాజెక్టుల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. నాబార్డ్ గ్రాంట్ కింద జీవనోపాదుల కల్పనకు విరివిగా అవకాశాలున్నాయని, సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.