News January 27, 2025
కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి: ఎస్పీ అమిత్ బర్దార్

పెండింగ్‌లోని కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసి కోర్టులో సమర్పించాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశించారు. సోమవారం పాడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన నెలవారీ నేర సమీక్షా నిర్వహించారు. పెండింగ్‌లోని కేసుల గురించి తెలుసుకుని NBW వెంటనే అమలు చేయాలన్నారు. గంజాయి కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించారు.
Similar News
News November 3, 2025
మానకొండూరు: పాఠశాల దారి మూసేశారు..!

మానకొండూరు(M) గట్టుదుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారికి ఫెన్సింగ్ వేయడంతో విద్యార్థులు రోడ్డుపైనే నిలబడి చదువుకోవాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఉన్న దారిని ఒక్కసారిగా ఎందుకు మూసేశారని గ్రామస్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదాలా లేక రాజకీయ కారణాలా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 3, 2025
JEEలో కాలిక్యులేటర్‌ను అనుమతించం: NTA

IIT, NITలలో ప్రవేశాలకు నిర్వహించే JEE మెయిన్‌లో కాలిక్యులేటర్‌ను అనుమతించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) స్పష్టం చేసింది. JEE-2026 ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో CBTలో కంప్యూటర్ స్క్రీన్‌పై కాలిక్యులేటర్‌కు అవకాశం ఉంటుందని పేర్కొంది. దీనిపై తాజాగా స్పష్టత ఇస్తూ టెస్టులో కాలిక్యులేటర్‌ను నిషేధించినట్లు తెలిపింది. బులెటిన్‌లో తప్పు దొర్లినందుకు విచారం వ్యక్తం చేస్తూ తాజా సవరణ నోట్‌ను వెబ్సైట్లో ఉంచింది.
News November 3, 2025
‘అనంతపురాన్ని కరవు జిల్లాగా ప్రకటించాలి’

అనంతపురం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నప్ప యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం నార్పల తహశీల్దార్ కార్యాలయం ముందు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అతివృష్టి కారణంగా ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు.


