News September 26, 2024
కేసుల్లో పురోగతి సాధించండి: ఎస్పీ గంగాధర్
కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌తో పురోగతి సాధించి, బాధితులకు సత్వర న్యాయమందించే దిశగా ప్రణాళికల రూపొందించాలని ఎస్పీ ఆర్ గంగాధర్ రావు తెలిపారు. మచిలీపట్నం
జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో ఎస్పీ బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై దిశా నిర్దేశం చేసి, స్నేహపూర్వక పోలీసింగ్ ప్రజలకు అందించి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.
Similar News
News October 11, 2024
ఇంద్రకీలాద్రిపై మహిషాసుర మర్దినిగా అమ్మవారు
ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కొలిచిన వారికి కొంగుబంగారమై నిలుస్తూ భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారిని నేడు దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేటి తెల్లవారుజాము నుంచే ఆలయ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
News October 11, 2024
కృష్ణా: BBA పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో BBA కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
News October 10, 2024
జగ్గయ్యపేట వ్యక్తికి వైసీపీలో కీలక పదవి
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగ్గయ్యపేటకు చెందిన ఇంటూరి రాజగోపాల్ (చిన్నా)ను వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించనున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇంటూరి చిన్నా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు.