News April 18, 2024

కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

image

సారా, మద్యం అక్రమ రవాణా కేసుల్లో పెండింగ్‌ కేసుల పురోగతిపై అధికారులతో ఎస్పీ రాధిక బుధవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌ అరెస్టులు, కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేసుల సత్వర పరిష్కారం కోసం కేసుల దర్యాప్తు వేగవంతం చేసి త్వరితగతిన నిందితులకు శిక్ష పడేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రేమ్ కాజల్ ఉన్నారు.

Similar News

News September 19, 2024

శ్రీకాకుళం జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

image

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు విషయాన్ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ‘ఇది మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిటి మండలం రాజపురం గ్రామానికి సీఎం రానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 19, 2024

రాజాం: పొగిరిలో కాకతీయుల నాటి శిల్పాలు

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో 1000 ఏళ్ల కిందటి అపురూపమైన శైవ శిల్పాలు ఉన్నాయని, ఆగ్రామం కాకతీయుల నాడు గొప్ప శైవక్షేత్రంగా వెలసిందని, రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం తెలిపారు. బుధవారం ఆ గ్రామానికి వెళ్లగా ఊరి ముందర రోడ్డుపక్కన నాగదేవత శిల్పముంది. అది అక్కడి చెరువు తవ్వుతుండగా దొరికిందని తెలిపారు. ఊర్లో ఉన్న వెయ్యేళ్ళ కిందటి అగస్త్యేశ్వర ఆలయాన్ని పరిశీలించారు.

News September 19, 2024

SKLM: విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

image

ఈ నెల సెప్టెంబరు 20 శుక్రవారం నాడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.