News March 25, 2025
కేసుల పరిష్కారానికి కృషి చేస్తా: APP

కామారెడ్డి కేసుల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, జిల్లా కోర్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవుని సూర్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్, పట్టణ ఎనిమిదవ వార్డు పార్టీ ఇంచార్జి గంప ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
Similar News
News November 12, 2025
గురుకులాల బకాయిలు విడుదల చేయాలి: డిప్యూటీ సీఎం

ప్రజా భవన్లో గురుకులాల సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎస్సీ, మైనారిటీ గురుకులాల ₹163 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు మెనూను తప్పక పాటించాలని సూచించారు. ఆహార నాణ్యత, తనిఖీల విషయంలో రాజీ పడకూడదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
News November 12, 2025
ఢిల్లీ పేలుడు: తబ్లీగీ జమాత్ మసీదులో 15 నిమిషాలు గడిపి..

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమర్ నబీకి సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. బ్లాస్ట్‌కు ముందు ఓల్డ్ ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ మసీదుకు అతడు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ 10-15 నిమిషాలు గడిపాడని, తర్వాత ఎర్రకోటలోని పార్కింగ్ ప్లేస్‌కు వెళ్లాడని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడు మసీదులోకి వచ్చి వెళ్లిన ఫుటేజీ సీసీటీవీలో రికార్డయిందని చెప్పాయి.
News November 12, 2025
HYD: ఫుడ్ స్టార్టప్‌లకు పోత్సాహకం: జయేష్ రంజన్

రాష్ట్రంలో సంప్రదాయ ఆహారానికి ప్రపంచ వేదికపై అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం దేశంలోనే తొలిసారి HYD వేదికగా ‘తెలంగాణ కలినరీ ఎక్స్‌పీరియన్షియల్ టూరిజం యాక్సిలరేటర్ (TSETA) ప్రారంభించింది. ఇండో- డచ్ సహకారంతో తెలంగాణ రుచులను ఇందులో ప్రదర్శించారు. ఫుడ్ స్టార్టప్‌లకు ప్రోత్సాహకంగా ఫుడ్-టెక్, డ్రింక్స్ రంగాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించనున్నట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు.


