News January 28, 2025

కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు: ఎస్పీ

image

కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతీ కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్థులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, విజుబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు.

Similar News

News October 25, 2025

కోపల్లెలో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

image

విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందిన ఘటన కాళ్ల మండలం కోపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కె.షాలేంరాజు(15) స్నేహితులతో కలిసి బ్యానర్ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఫ్రేమ్ విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందాడు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన తల్లిదండ్రులు కొడుకు మృతి చెందిన వార్త విని హుటాహుటిన కోపల్లె బయలుదేరి వస్తున్నట్లు సమాచారం.

News October 25, 2025

జిల్లాలో పాఠశాలలకు 3 రోజులు సెలవులు: కలెక్టర్

image

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఈనెల 27 నుంచి 29 వరకు 3 రోజులు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ప్రకటించారు. ఉపాధ్యాయులు మాత్రం స్కూళ్లకు హాజరు కావాలన్నారు. శిథిలావస్థలో ఉన్న వసతి గృహాలలోని విద్యార్థులను ఇళ్లకు పంపించాలన్నారు. సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 25, 2025

‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పకడ్బందీగా పూర్తి చేయాలి’

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివిజన్ పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దశలవారీగా, లోపాలకు తావు లేకుండా పూర్తి చేస్తామని వివరించారు.