News January 28, 2025
కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు: ఎస్పీ

కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతీ కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్థులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, విజుబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు.
Similar News
News February 7, 2025
మాఘమాస వేళ భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు శుక్రవారం ఉదయం అభిషేకం నిర్వహించారు. నేడు మాఘమాసం శుక్రవారం సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
News February 7, 2025
రెండో వన్డేలో విరాట్ ఆడతారా? గిల్ జవాబిదే

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి ODIకి విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. మోకాలిలో వాపు కారణంగా ఆయన తప్పుకొన్నారు. మరి రెండో వన్డేలో ఆడతారా? ఈ ప్రశ్నకు బ్యాటర్ శుభ్‌మన్ గిల్ జవాబిచ్చారు. ‘సరిగ్గా మ్యాచ్ రోజు నిద్రలేచే సమయానికి విరాట్ మోకాలు వాచింది. దీంతో ముందు జాగ్రత్తగా తొలి వన్డే మ్యాచ్ నుంచి తప్పుకొన్నారు. అది పెద్ద గాయం కాదు. రెండో మ్యాచ్ కచ్చితంగా ఆడతారనుకుంటున్నాను’ అని తెలిపారు.
News February 7, 2025
బెల్లంపల్లి: రైలు పట్టాలపై గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కన్నాల బ్రిడ్జి కింద గుర్తు తెలియని రైలు బండికి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉన్నట్లు గుర్తించామని రైల్వే ASIమోహన్ రాథోడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..మృతురాలి వయసు(30) సుమారుగా ఉంటుందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.