News January 7, 2025
కే.గంగవరం మండలంలో హత్య
కే.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూళ్ల గ్రామంలో సోమవారం రాత్రి సత్తి సువర్ణ రత్నం (35)ని అదే గ్రామానికి చెందిన మంచాల వెంకట సూర్య చంద్ర వివాహేతర సంబంధం కారణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 26, 2025
కడియం: నర్సరీ మొక్కలతో జాతీయ జెండా
76వ గణతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలిపుతూ కడియం పల్ల వెంకన్న నర్సరీలో మొక్కలు కూర్పుతో రిపబ్లిక్ డే సందేశాన్ని శనివారం రైతులు ప్రదర్శించారు. మువ్వన్నెల జెండా, ఎర్రకోట, ఆకృతులతో, రిపబ్లిక్ డే అక్షరమాలికను నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్, వినయ్‌లు సందేశాత్మకంగా తీర్చిదిద్దారు. ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలాడుతూ 76 వవసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఆకృతిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
News January 25, 2025
గోపాలపురంలో మాంసం దుకాణాలు బంద్
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గోపాలపురం మండలంలో రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్ చేయాలని తహశీల్దార్ కె.అజయ్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ రాత్రి నుంచి ఎలాంటి జంతు వధ చేయరాదన్నారు. చేపల మార్కెట్లను మూసివేయాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News January 25, 2025
రాజానగరం: హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు
రాజానగరంలోని రథేయపాలేనికి చెందిన రాంబాబుకు హత్య కేసుకు సంబంధించి జీవిత ఖైదు విధిస్తూ రాజమండ్రి 5వ అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. రాజానగరం సీఐ కథనం.. రాంబాబు 2020లో అదే గ్రామానికి చెందిన వెంకన్నను హత్య చేసి, వెంకన్న బాబును గాయపరిచాడు. ఆ ఘటనకు అప్పటి ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణల అనంతరం శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.