News April 29, 2024

కైకలూరుకు నేడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

image

రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ ఛైర్మన్, వైసీపీ యువజన అధ్యక్షుడులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నేడు కైకలూరులో పర్యటనించనున్నారు. ఆయన కైకలూరులోని ఏలూరు రోడ్‌లో వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి సీతారామ కన్వెన్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు జరిగే సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్యే DNR, MLC జయమంగళ, వైసీపీ నేత బీవీ రావు, పార్టీ శ్రేణులు పాల్గొంటారన్నారు. 

Similar News

News January 3, 2025

విజయవాడ: చిరంజీవి బుక్‌తో పవన్ కళ్యాణ్

image

విజయవాడలో బుక్ ఫెయిర్ గురువారం ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు స్టాల్స్‌లో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. మెగాస్టార్ చిరంజీవి సినీప్రస్థానం గురించి యూ.వినాయకరావు రచించిన “మెగాస్టార్ లెజెండ్ బుక్”ను ఆయన తీసుకున్నారు. సంబంధిత ఫొటోను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

News January 2, 2025

MTM : కానిస్టేబుల్ అభ్యర్థి మృతికి కారణాలివే.!

image

మచిలీపట్నంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో ఎ.కొండూరుకు చెందిన దారావత్ <<15046039>>చంద్రశేఖర్ (25) మృతి చెందడం<<>>పై పోలీసులు వివరణ ఇచ్చారు. కార్డియాటిక్ అరెస్ట్‌తో మరణించినట్లు వైద్యులు వెల్లడించారన్నారు. ప్రాథమికంగా పరీక్షలు చేసిన రిపోర్టుల్లో అతనికి SEPSIS కారణంగా WBC కౌంట్ 30వేలకు చేరిందన్నారు. అతను గత 5 రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని వైద్యులు తెలిపారు.

News January 2, 2025

విజయవాడ: వైసీపీ నేతకు సుప్రీంలో ఊరట

image

వైసీపీ నేత, రాష్ట్ర ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు గౌతమ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.