News October 11, 2024

కైకలూరులో రికార్డ్ స్థాయిలో ధరలు.. KG రూ.400

image

కైకలూరులో రికార్డు స్థాయిలో వెల్లుల్లి ధర పలుకుతోంది. అటు NTR జిల్లాలో కూడా భారీగా పెరిగాయి. ఇప్పటికే ఉల్లి, టమాటాలు సెంచరీకి దగ్గరలో ఉండగా.. వాటికి వెల్లుల్లి తోడయింది. ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ.400 పలుకుతోందని వినియోగదారులు, వ్యాపారస్థులు చెబుతున్నారు. ఇప్పటికే పలు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తక్కువ ధరలకు ఇచ్చే ఏర్పాట్లు చేయగా.. వాటిలో వెల్లుల్లిని చేర్చాలంటున్నారు.

Similar News

News November 11, 2024

‘ఇక్కడ ప్రార్థన చేస్తే కోరికలు నెరవేరుతాయి’

image

విజయవాడ గుణదల మేరీమాత చర్చి ప్రాచుర్యమైంది. ఈ పవిత్ర స్థలాన్ని మేరీమాత మందిరం అని పిలుస్తారు. ఇక్కడి కొండపై ఏర్పాటు చేసిన శిలువ అరుదైనదని భక్తులు చెబుతున్నారు. ఈ శిలువ వద్ద ప్రార్థనలు చేస్తే కోరికలు నెరవేరుతాయని క్రైస్తవుల నమ్మకం. ఇక్కడ నిత్యం చిన్నపిల్లలకు కుట్టు పోగులు, అన్నప్రాసన, తలనీలాలు సమర్పిస్తారు. వివాహాలు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

News November 11, 2024

మచిలీపట్నంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక 

image

మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతోందని, జిల్లా, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా మీకోసం కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు.  

News November 10, 2024

కృష్ణా: ANU దూరవిద్య MBA, MCA ఎంట్రన్స్ ఫలితాల విడుదల

image

ANU దూరవిద్య కేంద్రంలో MBA, MCA కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 9 నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కో ఆర్డినేటర్ రామచంద్రన్ ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 201 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 188 మంది పరీక్షకు హాజరయ్యారని, 184 మంది అర్హత సాధించారని చెప్పారు. అర్హత సాధించిన వారికి ఈ నెల 15లోగా ప్రవేశాలు కల్పిస్తామన్నారు.