News March 21, 2025
కైకలూరు: అత్త చేతి వేళ్లను రక్తం వచ్చేలా కరిచిన అల్లుడు

పిల్లనిచ్చిన అత్త చేతి వేళ్లను అల్లుడు రక్తం వచ్చేలా కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై ఎస్ఐ వెంకటేశ్వరరావు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. జంగం తిరుపతమ్మ (45) మార్చి 19న అల్లుడు బందెల జోజి బాబు ఇంటికి వెళ్ళారు. తన కూతురిని ఇంటికి పంపించాలని అల్లుడిని అత్త కోరగా, కోపంతో ఊగిపోయిన అల్లుడు అత్త చేతి వేళ్లను కొరికి గాయపరిచాడు. ఘటనపై ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News December 24, 2025
జహీరాబాద్: మాజీ సబ్ రిజిస్ట్రార్, కమిషనర్‌పై కేసు నమోదు

భూవివాదంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అప్పటి సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ హఫీజ్, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు పట్టణ SI వినయ్ కుమార్ తెలిపారు. 2018లో ZHBకు చెందిన నరసింహారెడ్డి, వేణుగోపాల్‌తో కలిసి HYDకు చెందిన వినోబా ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. అయితే రూల్స్ ఉల్లంఘించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి తనను మోసం చేశారని బాధితుడి ఫిర్యాదుతో అధికారులు సహానలుగురిపై కేసు నమోదైంది.
News December 24, 2025
రణస్థలం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలోని పైడిభీమవరంలో చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడి, మనస్తాపానికి గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 24, 2025
BELలో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<


